← Back to songs

Telugu · Gospel

Virigina Manase Neeke Priyamu

Artist: Not listed

Lyrics
పల్లవి విరిగిన మనసే నీకు ప్రియము ఏసునాధ ఉన్నతమైన స్థలముల యందు వసియించు వాడా విరిగే నా మనస్సు వసియింప రావా వసియింపరావా 1) విరిగిన దానిని కోరదు లోకం విరుగనిచో సృష్టిలో శూన్యం అల యాకోబును విరిచిన దేవా ఇశ్రాయేలుగా మలచుము నన్నీధరలో, ఈ ధరలో || విరి || 2) విరుగని మేఘం కురువదు భువిలో పగులని నేల ఫలముల నియ్యదు - సిలువలో మాకై నలిగిన దేవా జీవాహారము, జీవజలము నీవే నీవేగా || విరి ||