Telugu · Worship
Kanikarinchu Daivama swasaga maarina naa pranama
Artist: Not listed
Pallavi (Chorus):
కనికరించు దైవమా
శ్వాసగా మారిన నా ప్రాణమా
యేసయ్య.. యేసయ్య... యేసయ్య... నీ కృప చాలయ్య
Charanam 1:
ఎదలో అలజడులు - కెరటాలై ఎగిసిన
కన్నీరు సంద్రమై ఊపొంగ్గినా
నీ మీద నమ్మకం నన్ను నడుపుచున్నది
ఆ ఆశే ముందుకు పొమ్మంటుంది
Charanam 2:
మనసే కల్లోలమై భీతిల్లిన
ఆగాధ లోయలో సంచరించిన
నీ వాక్యమే అభయమిచ్చుచున్నది
ఆ మాటే ముందుకు నడుపుచున్నది
Charanam 3:
శ్రమల కొలిమిలో అలసిన
గమ్యమే కానరాక తొట్రిల్లిన
నీ సిలువ శ్రమల జ్ఞప్తికి వచ్చుచున్నవి
ఆ జీవ మార్గం వైపు అడుగులు కదులుచున్నవి