← Back to songs

Telugu · Gospel

Dikkulani nannu vekkirinchina naa dikkai neevai unthvi

Artist: Not listed

Lyrics
Pallavi: దిక్కులన్ని – నను వెక్కిరించిన నా దిక్కె – నీవై ఉంటివే బంధాలన్నీ – బహు దూరమైనా నా బంధం నీవై ఉంటివే నా సొంతమా – నా బంధమా – ఆరాధన నీకే అనురాగమా – నా ఏసయ్యా – ఆరాధనా నీకే Charanam 1: తెలియని కలతలే – నన్ను తరుముచుండగా ఎరుగని పోరాటమే – నను వెంటాడగా నీ రెక్కల నీడలో – నను దాచినావయా ఏ కీడు రాకుండా – నను కాచినవయ్య ఊగిసలాడే ఊపిరికి ఊరటనిచ్చితివే సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే Charanam 2: ఆరడి మాటలే – నను దోషిగా చేయగా ఆగని నిందలే – నను క్రుంగజేయగా హేతువే లేని గాయాలే – నను హేళన చేయగా ఎదుటే నిలిచినా – నీవే నా దరికే చేరగ గడిచిన కాలము – నడచిన మార్గము – నీవే చూచినది తగిలిన గాయము – పగిలిన హృదయం – నీవే మార్చినది Charanam 3: ఎడబాటులే అలవాటుగా – మారిపోయెనే తడబాటులే నను విడువక – తల్లడిల్ల చేయగా నేనున్నా నీతోనంటూ – నా వెంటే నడచితివి నా రక్షణ శృంగం నీవే – నను రక్షించావే అర్హతలేని అల్పునికి అధికారం మిచితివే అంతము వరకు ఆరాధించే భాగ్యము నిచితివే